Breaking News
Home / Film News / ఛార్మి మనసు దోచేసుకున్నకుర్రాడు

ఛార్మి మనసు దోచేసుకున్నకుర్రాడు

హైదరాబాద్‌: తన డ్యాన్స్‌తో ఓ కుర్రాడు ఛార్మి మనసు దోచేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా ఆ కుర్రాడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. ఇటీవల బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఈ చిత్రంలోని ‘సిలక.. సిలక..’ అంటూ సాగే ఓ మాస్‌ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ పాటకు శ్రీకాంత్‌ అనే కుర్రాడు డ్యాన్స్‌ చేసిన వీడియోను అతని స్నేహితుడు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌, ఛార్మిలను ట్యాగ్‌ చేశాడు.

తాజాగా ఆ వీడియోను చూసిన ఛార్మి అతని డ్యాన్స్‌కు ఫిదా అయిపోయింది. దీంతో శ్రీకాంత్‌ స్నేహితుడు పెట్టిన పోస్ట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. ఆ కుర్రాడిపై ప్రశంసలు కురిపించారు. ‘శ్రీకాంత్‌ చాలా అద్భుతంగా డ్యాన్స్‌ చేశావ్‌. నీతో ఎంతో ఎనర్జీ ఉంది. ఒకవేళ నేను అక్కడ ఉండి ఉంటే నీతో కలిసి డ్యాన్స్‌ చేసేదాన్ని’ అని ఛార్మి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోకి నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *