Breaking News
Home / National / పరారీలో ఎమ్మెల్యే….ఇంటికి నోటీసులు…

పరారీలో ఎమ్మెల్యే….ఇంటికి నోటీసులు…

ముజఫర్‌నగర్‌: ఛీటింగ్‌ కేసులో పరారీలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ఖైరానా ఎమ్మెల్యే నహిద్‌ హసన్‌ ఆస్తులు అటాచ్‌ చేయాలని ముజఫర్‌నగర్‌ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యే నహిద్‌ అహన్‌ ఇంటికి ఆస్తుల అటాచ్‌కు సంబంధించి నోటీసులంటించారు. క్రిమినల్‌ పీనల్‌ కోడ్‌లోని 82 సెక్షన్‌ కింద ఎమ్మెల్యే ఇంటికి నోటీసులు అంటించామని శామ్లీ జిల్లా ఎస్పీ అజయ్‌ కుమార్‌ తెలిపారు. ఆయనపై మొత్తం 12 కేసులు నమోదయ్యాయి. నవంబర్‌ 5 లోగా కోర్టు ఎదుట హాజరు కావాలని ఎమ్మెల్యే నహిద్‌ హసన్‌కు గడువు ఇచ్చినట్లు తెలిపారు. హసన్‌ తల్లి, మాజీ ఎంపీ తబస్సుమ్‌ హసన్‌ పై కూడా పలు కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *