Breaking News
Home / National / అయోధ్య లో సాయుధ పోలీసులు చెక్ పోస్టులు… ముమ్మర తనిఖీలు……

అయోధ్య లో సాయుధ పోలీసులు చెక్ పోస్టులు… ముమ్మర తనిఖీలు……

ఉత్తరప్రదేశ్: రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు మరి కొన్ని వారాల్లో తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో సాయుధ పోలీసులతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.అయోధ్యలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయోధ్య తీర్పు దృష్ట్యా మతకలహాలు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని అయోధ్య పోలీసు అధికారి అమన్ సింగ్ కోరారు. సుప్రీంకోర్టు తుది తీర్పును నవంబరు 17వ తేదీన వెల్లడించనున్న నేపథ్యంలో అయోధ్య నగరంలో ఇప్పటి నుంచే డిసెంబరు 10వతేదీ వరకు 144 సెక్షన్ నిషేధ ఉత్తర్వులు విధిస్తున్నట్లు అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. అయోధ్యలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. అయోధ్యలో తీర్పు అనంతరం బాణసంచా కాల్చకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీపావళి పండగ సందర్భంగా కూడా బాణసంచాను విక్రయించకుండా చర్యలు తీసుకున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *