Breaking News
Home / Lifestyle / Recipes / ఈ విధంగా చేస్తే చికెన్ పకోడి అదిరిపోతుంది…!

ఈ విధంగా చేస్తే చికెన్ పకోడి అదిరిపోతుంది…!

కావలసిన పదార్ధాలు..
చికెన్‌ – పావు కేజీ,
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక టీస్పూన్‌,
సెనగపిండి – రెండు కప్పులు,
జీలకర్ర – ఒక టీస్పూన్‌,
ధనియాల పొడి – ఒక టీస్పూన్‌,
బేకింగ్‌సోడా – చిటికెడు,
కొత్తిమీర – ఒక కట్ట,
పుదీనా – ఒక కట్ట,
నూనె – తగినంత,
ఉప్పు – సరిపడెంత..

తయారీ విధానం..

చికెన్‌ను శుభ్రంగా కడిగి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు పట్టించి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో సెనగపిండి తీసుకొని, జీలకర్ర, ధనియాలపొడి, బేకింగ్‌ సోడా, కొత్తిమీర, పుదీనా వేసి, తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలియబెట్టాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలను ఈ మిశ్రమంలో అద్దుకుంటూ నూనెలో డీప్‌ ఫ్రై చేయాలి. అంతే వేడి వేడి చికెన్ పకోడి రెడీ.

Check Also

సజ్జలతో మంచూరియా

Share this on WhatsAppకావలసిన పదార్థాలు: సజ్జ పిండి – 150 గ్రా., మిర్చి – 10 గ్రా., కొత్తిమీర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *