Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / భారీగా పెరిగిన కోడి మాంసం!

భారీగా పెరిగిన కోడి మాంసం!

కిలో రూ.220
పొట్టేలు ధర రూ.400
సామాన్యుడు కొనలేని పరిస్థితి
కళ్యాణదుర్గం/అనంతపురం: వేసవిని తలపిస్తున్న ఎండలతో చికెన్‌ ధరలు కొండెక్కాయి. ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్యుడు కోడి మాంసం కొనలేపిరిస్థితి నెలకొంది. వారం క్రితం బాయిలర్‌ కోడి కిలో రూ.160, పొట్టేలు, మేక మాంసం రూ.360కి విక్రయించేవారు. ప్రస్తుతం పొట్టేలు, మేక మాంసం రూ.400లకు, బాయిలర్‌ కోడి మాంసం రూ.220లకు విక్రయాలు సాగిస్తున్నారు. కోళ్ల ఫారాలలో ఉత్పత్తి లేకపోవడంతో చికెన్‌ సెంటర్లకు కోళ్ల సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మాంసం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వ్యాపారా వర్గాలు పేర్కొంటున్నాయి.

మాంసం ధరలు అమాంతంగా పెరగడంతో తినలేమూ.. కొనలేమూ అంటూ మాంసాహారులు వాపోతున్నారు. కళ్యాణదుర్గంతో పాటు నియోజకవర్గంలోని మిగత అన్ని మండలాలకు కర్నాటకలోని చిత్రదుర్గం, బళ్లారి, చిక్కబళ్లాపురం, దొడ్డ బళ్లాపురం తదితర పట్టణాల నుంచి కోళ్లు సరఫరా చేస్తున్నారు. ఫారం గేట్‌ ధరకు, చికెన్‌ సెంటర్లకు సరఫరా చేసే ధరలకు పొంతన ఉండదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో వినియోగదారుల పై అదనపు బారం పడుతుందని వారే స్పష్టం చేస్తున్నారు. చికెన్‌ సెంటర్లలో కోడి మాంసం ధరలు పెరగడంతో అందుకు తగ్గటుగానే పొట్టేళ్ల మాంసం ధరలు కూడా రూ.360ల నుంచి రూ.400లకు పెంచి మాంసపు ప్రియుల నడ్డి విరుస్తున్నారన విమర్శలను వ్యాపారులు ఎదుర్కొంటున్నారు.

వారం క్రితం డజన్‌ కోడి గుడ్ల ధర రూ.48లు ఉండగా ప్రస్తుతం రూ.58 నుంచి రూ.60లకు హోల్‌సెల్‌ వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఇలా కోడి, పొట్టేళ్ల మాంసంతో పాటు గుడ్ల ధరలు కూడా అమాంతంగా పెరగడంతో మాంసపు ప్రియుల గొంతులో పచ్చివెలక్కాయి పడ్డ చందంగా వారి పరిస్థితి తయారయ్యింది. ఫారం గేట్‌ ధర కిలో కోడి రూ.99ల నుంచి రూ.100లు ఉండగా కళ్యాణదుర్గంలో రూ.130 నుంచి రూ.140ల దాకా కిలో కోడిని విక్రయిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారికి జీఎ్‌సటీ, ఉత్పత్తి తగ్గడం, డిమాండ్‌ పెరగడం లాంటి సాకులు చెబుతూ వ్యాపారులు తమ పబ్బం గడుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మాంసం తినడం మానుకోవాల్సిందే : రవీంద్ర
రోజురోజుకు అడ్డూ, అదుపు లేకుండా పెరుగుతున్న కోడి, పొట్టేలు, మేక మాంసంను కొనలేక మాంసాన్ని తినడమే మానుకోవాల్సి వస్తుంది. ఉత్పత్తి తగ్గడం, జీఎస్టీ విధించడం లాంటి పేరుతో చికెన్‌ ధరలు పెంచుతున్న వ్యాపారులు నియంత్రించే వారు కరువయ్యారు. గతంలో కిలో మాంసం తీసుకునే వాళ్లం, ప్రస్తుతం ఆరకిలోతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుచి,శుభ్రతను పాటించకపోయిన మాంసంపై ఉన్న మక్కువతో ధరలు పెరుగుతున్నా తక్కువ మోతాదులోనైనా కొనాల్సిందే. కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచేస్తున్న వ్యాపారుల పై అధికారులు చర్యలు తీసుకోవాలి.

ఉత్పత్తి లేకనే ధరలు పెరుగుతున్నాయి : రమేష్‌, వ్యాపారి
విపరీతమైన ఎండల మూలంగా కోళ్ల ఫారాల్లో కోళ్ల పెంపకం గణనీయంగా తగ్గింది. ఉన్న కొద్దిపాటి కోళ్లకు సైతం వ్యాదులు సోకడంతో అవి చిన్నప్పుడే చనిపోయాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ సప్లైయ్‌ లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో తగ్గే అవకాశాలున్నట్లు సూచనలున్నాయి. ధరలు పెరగడంతో వ్యాపారాలు బాగా పడిపోయాయి. ఆది, మంగళ, శుక్రవారాల్లో వ్యాపారాలు ఆశాజనకంగా ఉండేవి ప్రస్తుతం ధరలు పెరగడంతో మాంసం విక్రయాలు సగానికి సగం పడిపోయాయి. దీంతో తమకు కూలీ కూడా గిట్టడం లేదు. ఇలాగే ధరలు కొనసాగితే కొనేవారు రాక దుకాణాలు మూసి వేసుకోవాల్సిందే.

Check Also

సీబీఐ ప్రతిష్ట దెబ్బతిన్నది

Share this on WhatsAppవిజయవాడ: దేశంలో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిన్నదని, సీబీఐ ఆఫీసులో సీబీఐ అధికారులే దాడులు చేస్తున్నారని న్యాయవాది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *