మోదీ, అమిత్ షా, నిర్మలతో భేటీ?
న్యూఢిల్లీ/అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఢిల్లీ రానున్నారు. ఆ రోజు ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలుస్తారని తెలిసింది. వీరిలో ఎవరిని ముందు కలుస్తారో.. అసలు సమావేశమవుతారో లేదో ఇంకా ఖరారు కాలేదని ఓ అధికారి చెప్పారు. అమిత్ షా ఇంకా సమయం కేటాయించనప్పటికీ ఆ రోజు భేటీ మాత్రం ఖాయమైందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర పునర్విభజన సమస్యలపై ఉభయులూ చర్చిస్తారని సమాచారం. అవసరమైతే శనివారం కూడా జగన్ ఢిల్లీలోనే ఉండొచ్చని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ ఆయన సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
