చెన్నై: రెండు రోజుల భారత పర్యటనకు గాను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కొద్దిసేపటి క్రితం చెన్నై చేరుకున్నారు. చెన్నె చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి… మేళతాలాలు, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ కు బయల్దేరనున్నారు. మరోవైపు, ఆయన ప్రయాణించే మార్గమంతా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అనంతరం ఇక్కడి నుంచి ఆయన మహాబలిపురం బయల్దేరుతారు. అక్కడ ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలుకుతారు. పర్యటనలో భాగంగా ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు.
