Breaking News
Home / States / Andhra Pradesh / మరో కేసులో చింతమనేని కోర్టుకు హాజరు…

మరో కేసులో చింతమనేని కోర్టుకు హాజరు…

ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రిమాండ్‌ ముగియడంతో జిల్లా జైలు నుంచి ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. మాజీ సర్పంచ్‌ మేడికొండ వెంకటసాంబ కృష్ణారావు అనే వ్యక్తిపై దాడికి సంబంధించిన మరో కేసులో చింతమనేనిని కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. 2018లో పెదవేగి మండలం గార్లమడుగు గ్రామ సమీపంలోని పోలవరం కుడికాలువ గట్టు మట్టి తరలింపు వ్యవహారంపై గ్రామానికి చెందిన కృష్ణారావు ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. చింతమనేని ఫిర్యాదిదారుడిని తన ఇంటికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సంఘటనపై పెదవేగి పోలీస్‌ స్టేషన్‌లో 2018లోనే క్రైం సంఖ్య 248/2018గా నమోదవగా అప్పటి నుంచి కేసు పెండింగ్‌లో ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *