Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సతీసమేతంగా అమరావతి బయల్దేరిన చిరంజీవి

సతీసమేతంగా అమరావతి బయల్దేరిన చిరంజీవి

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో నటుడు చిరంజీవి భేటీ కానున్నారు. సీఎం జగన్‌ను కలిసేందుకు చిరంజీవి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి అమరావతికి బయల్దేరి వెళ్లారు. సీఎంతో కలిసి చిరంజీవి దంపతులు లంచ్ చేయనున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని వీక్షించాలని సీఎం జగన్‌ను కోరనున్నారు. చిరంజీవి, జగన్ భేటీపై రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

జగన్ సీఎం అయిన తరువాత టాలీవుడ్ నుంచి ఎవరూ కలవలేదన్న ప్రచారం నేపథ్యంలో తొలిసారిగా అగ్రహీరోల్లో ఒకరైన చిరంజీవి కలవనుండటంతో సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాలు కూడా ఈ పరిణామాలను ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. అయితే.. కేవలం మర్యాదపూర్వక భేటీయేనని చిరంజీవి సన్నిహితులు స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *