Breaking News
Home / National / మోదీ, అమిత్ షాలతో చిరంజీవి భేటీ….

మోదీ, అమిత్ షాలతో చిరంజీవి భేటీ….

న్యూఢిల్లీ: సినీ నటుడు చిరంజీవి ‘సైరా’ మూవీ ప్రమోషన్స్‌ భారీగా చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో చిరంజీవి భేటీ కాబోతున్నారు. ఇందుకోసం ఎంపీ సీఎం రమేష్‌తో కలిసి చిరంజీవి ఢిల్లీ చేరుకున్నారు. తొలుత ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసి, ‘సైరా’ సినిమా చూడాల్సిందిగా కోరనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి ‘సైరా’ విశేషాలను వివరించనున్నారు. సినిమా చూడాల్సిందిగా అమిత్ షాను కూడా కోరనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ‘సైరా’ సినిమాను వీక్షించనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *