Breaking News
Home / Film News / అగ్రహీరోలకు నృత్యం నేర్పిన ప్రముఖ కొరియోగ్రాఫర్ అరెస్ట్

అగ్రహీరోలకు నృత్యం నేర్పిన ప్రముఖ కొరియోగ్రాఫర్ అరెస్ట్

ముంబై: నృత్య శిక్షణ పేరుతో మోడల్స్‌ను, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నటీమణులను సెక్స్ రాకెట్‌లోకి దింపుతున్న మహిళా కొరియోగ్రాఫర్ ఆగ్నెస్ హెమిల్టన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆగ్నెస్ అమ్మాయిలను అక్రమంగా ఆఫ్రికాదేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. కాగా ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ మొదలుకొని చాలామందికి నృత్యంలో శిక్షణ ఇచ్చారు. అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్లు ప్రభుదేవా, గణేశ్ ఆచార్యలకు అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆగ్నెస్ ముంబైలో డాన్స్ క్లాసులు నిర్వహిస్తుంటారు. ఆమె తన దగ్గరకు నృత్య శిక్షణకు వచ్చే యువతులను ప్రలోభాలకు గురిచేసి విదేశాలకు తరలించి సెక్స్‌రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు ఆమె వద్ద లభ్యమైన పలు ఆధారాలను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

‘భారతీయుడు 2’లో రకుల్?…

Share this on WhatsAppహైదరాబాద్‌: విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో రకుల్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *