Breaking News
Home / States / ఎంపీ ఛాలెంజ్ ను స్వీకరించిన సినీ హీరో….

ఎంపీ ఛాలెంజ్ ను స్వీకరించిన సినీ హీరో….

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను సినీ నటుడు వరుణ్ తేజ్ కొణిదెల స్వీకరించాడు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వరుణ్ తేజ్‌ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటాడు. గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి, అక్కినేని అఖిల్‌కు ధన్యవాదాలు తెలిపాడు. కొంచెం బిజీగా ఉన్నా..కానీ మంచి పనికోసం కొంచెం ఆలస్యంగానైనా స్పందించాల్సిందేనని ట్వీట్‌ చేశారు. అంతేకాదు హరా హైతో భరా హై హ్యాష్‌ ట్యాగ్‌ తో గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హీరోయిన్లు సాయి పల్లవి, తమన్నాలను నామినేట్‌ చేశాడు. మరి ఈ మెగా ప్రిన్స్ ఛాలెంజ్‌ను సాయి పల్లవి, తమన్నా ఎపుడు స్వీకరిస్తారో వేచి చూడాలి. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *