Breaking News
Home / National / పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం..

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం..

న్యూఢిల్లీ: అధికార, ప్రతిపక్ష పార్టీల తీవ్ర వాద ప్రతివాదాల మధ్య వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు- 2019కి రాజ్యసభలో ఆమోదం లభించింది. ఓటింగ్ జరిగే సమయానికి పెద్దల సభలో మొత్తం 209 మంది సభ్యులు ఉండగా బిల్లుకు అనుకూలంగా 117 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 92 మాత్రమే దక్కాయి. అంతకు ముందు సెలక్ట్ కమిటీకి ఈ బిల్లును పంపాలా లేదా అన్న దానిపై జరిగిన ఓటింగ్‌కు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఇప్పటికే లోక్‌సభలో భారీ మెజారిటీతో ఆమోదం పొందిన ఈ బిల్లు ఇప్పుడు పెద్దల సభలో కూడా గట్టెక్కడంతో… దీని అమలుకు ఇక రాష్ట్రపతి సంతకమే మిగిలింది. కాగా ఈ బిల్లు ద్వారా దేశ పౌరులెవరూ తమ పౌరసత్వ హక్కులు కోల్పోరని, దీనిపై ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. దీనిపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అన్ని సందేహాలను ఇవాళ పెద్దల సభలో నివృత్తి చేసింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *