Breaking News
Home / States / Andhra Pradesh / వారంలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

వారంలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

లాక్ డౌన్ లో సడలింపులు చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను తిప్పడానికి అనుమతినిచ్చింది. అయితే సిటీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో అక్కడ మాత్రం ఇంకా బస్సులను తిప్పడానికి అనుమతనివ్వలేదు. కాగా మరో వారంలో సిటీలో కూడా సిటీ బస్సులను నడిపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. సిటీ బస్సులను సైతం నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈనెల 31తో నాలుగో విడత లాక్‌డౌన్‌ ముగుస్తున్న నేపథ్యంలో కేం ద్రం మరికొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇక కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేస్తుందో చుసిన అనంతరం వచ్చేనెల 5 నుండి బస్సులను ప్రారంభించే దిశగా ఆర్టీసీ ఉన్నట్టు సమాచారం. అయితే బస్సులను ప్రారంభించినప్పటికీ భౌతికదూరం, శానిటైజర్లను వాడటం చేస్తారట. ఇక మొదట సిటీలోని కొన్ని ప్రాంతాలకే బస్సులను నడిపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *