ఢిల్లీ : ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి తదుపరి సీజేఐగా శరద్ అర్వింద్ బాబ్డే పేరును ప్రతిపాదిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. గొగొయి పదవీకాలం నవంబర్ 17న తీరిపోనుంది. గొగొయి తర్వాత సీనియార్టీలో జస్టిస్ బోబ్డేనే ఉన్నారు. దీంతో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు గొగొయి లేఖ రాశారు. జస్టిస్ బాబ్డే మధ్యప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఇక గొగొయి గతేడాది అక్టోబరు 3న సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ బాబ్డేను సీజేఐగా నియమిస్తే నవంబరు 18న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈయన 18నెలల పాటు సీజేఐగా ఉంటారు. నిబంధనల ప్రకారం జస్టిస్ గొగొయి ప్రతిపాదనను న్యాయశాఖ మంత్రి, ప్రధాన మంత్రి ముందు ఉంచుతారు. ఈ విషయాన్ని ప్రధాని, రాష్ట్రపతికి తెలియజేస్తారు.
