Breaking News
Home / States / ప్రణాళిక పనులతో పల్లెలు పరిశుభ్రం…

ప్రణాళిక పనులతో పల్లెలు పరిశుభ్రం…

బషీరాబాద్‌ : ప్రణాళిక పనులతో పల్లెలు పరిశుభ్రంగా మారుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డు, డీఆర్సీ సెంటర్‌ల ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం మైల్వార్‌, జీవన్గి, మంతట్టి, క్యాద్గీరా, మంతన్‌గౌడ్‌, మంతన్‌గౌడ్‌తండా, బషీరాబాద్‌, కుప్పన్‌కోట్‌ తదితర గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. తడి, పొడి చెత్తను వేరువేరుగా వేసేందుకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు చెత్త బుట్టలను పంపిణీ చేసి ఆ చెత్తను తరిలించేందుకు రిక్షాలను సమకూర్చుకుంటున్నారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడా కూడా రోడ్లపై వేయకూడదని ప్రజలకు తెలియజేశారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. బషీరాబాద్‌ పంచాయతీ పరిధిలోని జీవన్గికి వెళ్లే రోడ్డు మార్గంలో చెత్తను వేస్తున్నందుకు 16 మంది దుకాణదారులకు నోటీసులు అందజేసి మళ్లీ చెత్త వేస్తే భారీగా జరిమానాలు విధిస్తామన్నారు. చెత్త వేసేందుకు సిమెంట్‌ రింగ్‌లతో కూడిన కుండిలను అక్కడక్కడ ఏర్పా టు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *