హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ వాస్తవ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీకి ఉన్న అప్పులు.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, పన్నుల వివరాలను వెల్లడించాలన్నారు. ఈ మేరకు నారాయణరెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రూ.65వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్నుపడిందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలన్నారు. సమ్మెపై సీఎం దృష్టి సారించాలని.. ప్రజా రవాణా ఆగిపోవడంతో దాదాపు కోటి మంది ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పారు.
