విజయవాడ: ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.20కి ఢిల్లీ చేరుకుని నేరుగా తన అధికార నివాసానికి చేరుకుంటారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా సహా ఇతర కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. అమిత్ షాతో భేటీకి జగన్ ఇంతకుముందు మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ, ఆయన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బిజీగా ఉండడంతో, వీరిద్దరి మధ్య భేటీకి అవకాశం లభించలేదు. ప్రచారం ముగిసి నేడు ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ఈరోజు ఆయనను జగన్ కలవనున్నారు.
