Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలి…

రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలి…

అమరావతి: ఏపీ రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని అసెంబ్లీలో టీడీపీ డిమాండ్ చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధానిపై అయోమయం నెలకొందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. అమరావతి ఐదుకోట్ల మంది ప్రజల కలల రాజధాని అని అన్నారు. కొత్త రాష్ట్రానికి తప్పనిసరిగా రాజధాని ఉండాలన్నారు. అమరావతి ముంపు సమస్యలేదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పటికే నిర్మాణం ప్రారంభం అయినందువల్ల.. రాజధాని నిర్మాణం నిలిపివేస్తే.. ఆర్థికంగా నష్టపోవడంతోపాటు.. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇందుకు మంత్రి బొత్స సత్యానారాయణ జవాబు ఇచ్చారు. త్వరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *