Breaking News
Home / States / Andhra Pradesh / 3న ఏలూరు రానున్న సీఎం జగన్

3న ఏలూరు రానున్న సీఎం జగన్

ఏర్పాట్లపై కలెక్టర్‌ ముత్యాలరాజు సమీక్ష

ఏలూరు: జనవరి 3న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏలూరు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా అధికారులను ఆదేశించారు.ఈ మేరకు మంగళవారం ఏలూరు ఇండోర్‌ స్టేడియం బహిరంగ సభా స్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. జనవరి 3న ఉదయం 11 గంటలకు హెలీకాఫ్టర్‌లో సీఆర్‌రెడ్డి కళాశాలకు చేరుకుని నేరుగా వంగాయిగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అక్కడ నుంచి సాయినగర్‌లో నిర్మించతల పెట్టిన వంతెనకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం ఇండోర్‌ స్టేడియానికి చేరుకుని ఆరోగ్య శ్రీ ఎక్స్‌టెన్షన్‌ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. వివిధ శాఖలకు కేటాయించిన పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.ఇండోర్‌ స్టేడియంలో ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికి 50 వేల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, ప్రత్యేక ఫించన్లు మంజూరు, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేస్తారని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌, ఆరోగ్య శ్రీ సీఈవో డాక్టర్‌ ఎ. మల్లికార్జున్‌, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, డీఆర్‌వో పి. శ్రీనివాసమూర్తి, ఆర్డీవో పి.రచన, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *