అమరావతి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు తాను ఇచ్చే విందుకు హాజరు కావాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం జగన్ ఆహ్వానాలు పంపారు. కాగా, జిల్లాకో టేబుల్ చొప్పున 13 టేబుళ్లపై విందు ఏర్పాటు చేయనుండగా, ఒక్కో టేబుల్ వద్ద కనీసం 10 నిమిషాల పాటు గడుపుతారని సమాచారం. ఈ సందర్భంగా జిల్లాల పరిస్థితులు, సమస్యల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటారని, వాటికి పరిష్కార మార్గాలపై సలహాలు అడగనున్నారని తెలుస్తోంది. ఇక ఈ విందులో సంప్రదాయ ఆంధ్రా వంటకాలతో పాటు నార్త్, సౌత్ ఇండియన్ వంటలను వడ్డిస్తారని సమాచారం. కాగా, ఈ విందుకు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరకానున్నారు.
