Breaking News
Home / States / Andhra Pradesh / రేపు తిరుమలకు సీఎం జగన్

రేపు తిరుమలకు సీఎం జగన్

అమరావతి: బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సోమవారం తిరుమలకు రానున్నారు. ఈ సందర్భంగా సీఎం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతికి చేరుకుంటారు. సాయంత్రం 4.15గంటలకు ‘అలిపిరి- చెర్లోపల్లి’ జంక్షన్‌లో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 5.15గంటలకు తిరుమలలో మాతృశ్రీ వకుళాదేవి యాత్రికుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేసి, పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. రాత్రి 7గంటలకు ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. సోమవారం రాత్రి జగన్ తిరుమలలోనే బస చేస్తారు. మంగళవారం ఉదయం విజయవాడకు బయలుదేరనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *