Breaking News
Home / States / Andhra Pradesh / సీఎం జగన్‌ రాజకీయంగా పునర్జన్మనిచ్చారు…….

సీఎం జగన్‌ రాజకీయంగా పునర్జన్మనిచ్చారు…….

విజయవాడ: తాను ప్రత్యర్థిగా పోటీ చేసినా ఏదీ మనసులో పెట్టుకోకుండా మంత్రి కొడాలి నాని సహకరించారని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌ అన్నారు. విజయవాడలో బుధవారం తన ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరడానికి సహకరించిన వైవీ సుబ్బారెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు. ‘నా తండ్రి దేవినేని రాజశేఖర్‌కు 40 ఏళ్లుగా తోడున్న ప్రతి కార్యకర్తకు, నాయకులందరికీ అభినందనలు. నాకు జన్మనించింది నా తండ్రి రాజశేఖర్‌ అయితే.. రాజకీయ పునర్ జన్మనిచ్చింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లతోపాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *