Breaking News
Home / States / Andhra Pradesh / నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం…

నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం…

విశాఖ: విశాఖపట్నంలో నౌకాదళ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్‌ హాజరై.. నౌకాదళ సిబ్బందికి నేవీ డే శుభాకాంక్షలు తెలిపారు. తీరరక్షణ, విపత్తుల సమయంలో నౌకాదళ సిబ్బంది సేవలు ఆమోఘమని సీఎం కొనియాడారు. అనంతరం నావికాదళ విన్యాసాలను సీఎంతో పాటు తూర్పు నావికాదళాధిపతి అతుల్‌ కుమార్‌ జైన్‌ తిలకించారు. నావికాదళ విన్యాసాలను చూసేందుకు తరలివచ్చిన వేలాది మందితో బీచ్‌రోడ్‌ కిటకిటలాడింది. అంతకుముందు సాగరతీరాన అమర వీరులకు తూర్పు నౌకాదళ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ నివాళులర్పించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *