Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఆనం మాటలకు నవ్వుకున్న సీఎం జగన్…

ఆనం మాటలకు నవ్వుకున్న సీఎం జగన్…

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో విద్యుత్ ఒప్పందాలపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆందోళన చేస్తారా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కొత్త సంప్రదాయానికి తెర తీస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రశ్నోత్తరాలలో నిరసన తెలిపే సంప్రదాయం లేదని ఆయన చెప్పుకొచ్చారు. విద్యుత్ ఒప్పందాలపై ఇప్పటికే ప్రభుత్వం సరైన సమాధాన ఇచ్చిందన్నారు. విద్యుత్‌పై టీడీపీది సరైన వాదన కాదన్నారు.

దయచేసి నా సీటు మార్చండి సార్.. సభ్యులు ఎవరైనా మాట్లాడితే మాట్లాడుతాను కానీ.. ప్రతిపక్ష నేతే నా పక్కన నిలబడితే నేనేం మాట్లాడగలను సార్.. ఆయన నా పక్కన నిల్చున్నా.. కూర్చున్నా మాట్లాడేంత ధైర్యం, శక్తి నాకుందా సార్.. వారి ముందు నేను చాలా చిన్నవాణ్ణి.. వారొచ్చి నా పక్కన నిల్చుంటే నేనేం మాట్లాడగలను. దయచేసి అరాచక శక్తులు అనే పదం వారు ఉపసంహరించుకోమని చెప్పండి లేదా మీరైనా (స్పీకర్) రికార్డ్స్‌లో నుంచి తొలగించండి ‘ అని ఆనం ఒకింత సెటైరికల్‌గా మాట్లాడారు.

అయితే ఆనం మాట్లాడుతున్నంత సేపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవ్వుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ తర్వాత మాట్లాడిన వైసీపీ సభ్యులు సైతం నవ్వుకుంటూనే సభలో మాట్లాడారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని కలుగజేసుకుని.. సభ్యుల హక్కులను గౌరవించాలని ప్రతిపక్షనేత చంద్రబాబుకు చెప్పారు. మొత్తానికి చూస్తే నిన్న మొన్నటి వరకూ నెలకొన్న ఆనం వివాదానికి.. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే దాదాపు ఫుల్‌స్టాప్ పడినట్లేనని దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.!

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *