Breaking News
Home / States / Andhra Pradesh / నూతన వధూవరులను ఆశీర్వదించిన సిఎం జగన్!

నూతన వధూవరులను ఆశీర్వదించిన సిఎం జగన్!

రాజమండ్రి : వైసీపీ పార్టీ రాజమండ్రి సమన్వయకర్త శివరామ సబ్రహ్మణ్యం కుమార్తె అమృతవల్లి వివాహం రాజమహేంద్రవరంలోని మంజీరా ఫంక్షన్‌ హాల్లో వైభవంగా జరుగగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సీఎంతో పాటు మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పినిపే విశ్వరూప్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలతో పాటు ఎంపీ భరత్‌, కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా తదితరులు హాజరై వారిని ఆశీర్వదించారు.

ఇదిలా వుండగా, ఆంధ్రప్రదేశ్‌ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహం తణుకులో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పట్టణంలోని బెల్‌ వెదర్‌ స్కూల్‌ ఆవరణలో వివాహ వేడుక జరుగుతుండగా, సీఎం కాసేపట్లో తణుకు చేరుకోనున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పట్టణమంతా నూతన వధూవరుల ప్లెక్సీలతో నిండిపోయింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *