ఏర్పాట్లు పరిశీలించిన కాకాణి
నెల్లూరు/ముత్తుకూరు: రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముత్తుకూరు రానున్నారని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. అధికారులు, నాయకులతో కలసి ఎంపీడీవో కార్యాలయం వెనుక ఉన్న మైదానాన్ని పరిశీలించారు. సీఎం సభ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. రైతు భరోసా సభలో పాల్గొనేందుకు సీఎం నేరుగా హెలికాఫ్టర్‌లో మత్స్యకళాశాలలో దిగేందుకు హెలీప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు. మత్స్యకళాశాల నుంచి సభా వేదిక వద్దకు వెనుక వైపు నుంచి వ్యవసాయ గోదాముల మీదుగా మార్గం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించారు.
మండల కార్యాలయాల వెనుక ఉన్న విశాల మైదానాన్ని సభావేదికగా నిర్ణయించారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ ముత్తుకూరుకు తొలిసారిగా రానున్నందున సభను జయప్రదం చేసేందుకు కృషి చేయాలని స్థానిక నాయకులతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ ఖాజావలి, వైసీపీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు శివప్రసాద్, ముత్యంగౌడ్, శ్రీనివాసులురెడ్డి, శేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సూరి, మస్తాన్ పాల్గొన్నారు.