Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / పంచాయతీ కార్యాలయాలకు రంగులు మార్చాలని సీఎం జగన్‌ ఆదేశం

పంచాయతీ కార్యాలయాలకు రంగులు మార్చాలని సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి : హైకోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాల రంగులు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జగన్‌ సర్కార్‌ అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే వేయాలని ఆదేశించింది. కాకపోతే సీఎం జగన్మోహన్‌రెడ్డి బొమ్మ మాత్రం తప్పనిసరిగా ఉండాలని సూచించింది. నీలం, ఆకుపచ్చ రంగుల్ని వెంటనే తొలగించాలని, వీటికి 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు ఖర్చు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అయితే ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పార్టీ జెండా రంగులు వేయడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రంగులు తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Check Also

గుంటూరు జిల్లాలో నేటి నుంచి నిబంధనలు మార్పు..

Share this on WhatsAppఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జనాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *