అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రంగనాథరాజు హాజరయ్యారు. అర్బన్ ప్రాంతాల్లో అవకాశం ఉన్న చోట పేదలకు ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని జగన్ ఆదేశించారు. అభ్యంతరంలేని అక్రమ నిర్మాణాల రెగ్యులైజేషన్పై విధివిధానాలు సిద్ధం చేయాలని, 2 సెంట్ల వరకూ నామినల్ ఫీజుకే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అవకాశం ఇవ్వాలని జగన్ సూచించారు.
