అమరావతి: టూరిజం, యూత్, శిల్పారామంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో పర్యాటక శాఖ అధికారులు, మంత్రి అవంతి శ్రీనివాస్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటళ్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమీక్ష అనంతరం మంత్రి అవంతి మీడియాతో మాట్లాడుతూ.. బోట్ల ఫిట్నెస్ చూశాకే నదిలో ప్రయాణానికి అనుమతిని ఇస్తామని స్పష్టం చేశారు. రూ. కోటితో శిల్పారామాల మరమ్మతులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఇడుపులపాయలో శిల్పారామం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
