Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సీఎం జగన్ ఒకే ఒక్క మాట చెప్పారు: ఆర్టీసీ జేఏసీ

సీఎం జగన్ ఒకే ఒక్క మాట చెప్పారు: ఆర్టీసీ జేఏసీ

అమరావతి: తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అనంతరం ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని చెబితే.. ముఖ్యమంత్రి ఒకే ఒక్క మాట చెప్పారని, మీరు ఆర్టీసీ ఉద్యోగులన్న సంగతి మర్చిపోవాలని, ఇకనుంచి మీరంతా ప్రభుత్వ ఉద్యోగులని చెప్పారని, అలాగే ఆర్టీసీ నష్టాల గురించి కూడా మర్చిపోవాలని, ఆ విషయం ప్రభుత్వం చూసుకుంటుందని జగన్ చెప్పారని నేతలు సంతోషం వ్యక్తం చేశారు.

అటు రాష్ట్రంలో కూడా ఇబ్బందులు ఉన్నాయని, అయినా పరిపాలన జరుగుతుందని.. అందుచేత ఆర్టీసీ ఉద్యోగులంతా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులని, అందరూ ధైర్యంగా ఉండాలని సీఎం జగన్ చెప్పారని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే మంత్రి, చీఫ్ సెక్రటరీతో మాట్లాడి పరిష్కరించుకోవచ్చుని తమకు భరోసా ఇచ్చారని నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో కార్మికులు ఇబ్బందులు పడకుండ చూసుకునే బాధ్యత తమదని సీఎం చెప్పారని వారన్నారు. తమ 27 డిమాండ్లకు సంబంధించి యాజమాన్యం నుంచి రాతపూర్వకంగా ఒప్పంద పత్రం ఇవ్వడం జరిగిందని నేతలు తెలిపారు.

Check Also

ఆయన ప్రభుత్వం చీకటి ఆలోచనలు చేస్తోంది….

Share this on WhatsAppగుంటూరు: రాష్ట్రంలో మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సిగ్గు చేటని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *