Breaking News
Home / States / హుజూర్‌నగర్ లో సీఎం సభ రద్దు…

హుజూర్‌నగర్ లో సీఎం సభ రద్దు…

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ పర్యటన రద్దయింది. ఈరోజు సాయంత్రం అక్కడ సీఎం సభ జరగాల్సి ఉంది. అయితే గత రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తుండటంతో పైలట్ల సూచన మేరకు హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ఏవియేషన్‌ శాఖ అనుమతి ఇవ్వలేదు. మార్గమధ్యంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో అనుమతి నిరాకరించినట్లు ఏవియేషన్‌ డైరెక్టర్‌ భరత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్‌ సభను రద్దు చేసినట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. సీఎం సభ రద్దు కావడంతో కార్యకర్తలు నిరాశగా అక్కడి నుంచి వెనుదిరిగారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *