Breaking News
Home / States / కోర్టు ఆదేశాలపై కేసీఆర్‌ సమీక్ష…

కోర్టు ఆదేశాలపై కేసీఆర్‌ సమీక్ష…

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రవాణశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మతో పాటు పలువురు ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. ఈనెల 21 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. మరోవైపు కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని.. ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించాలని ఉన్నత న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *