హైదరాబాద్: ఆర్టీసీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమీక్ష ప్రగతి భవన్ లో జరగనుంది. ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ అధికారులు ప్రగతి భవన్కు చేరుకున్నారు. మరికాసేపట్లో సమీక్ష ప్రారంభం కానుంది. అయితే ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ ఏదో ఒకటి తేల్చేస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? ఇవాళ కార్మికులకు శుభవార్త చెబుతారా..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
