Breaking News
Home / States / ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష…

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష…

హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. శనివారం ఆయన ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కొత్త నియామకాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. దీంతో ఇంకా  ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది. బస్‌ భవన్‌ వద్ద కార్మికులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *