Breaking News
Home / States / Andhra Pradesh / రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం….

రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం….

నెల్లూరు: గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌’ పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. దీనిద్వారా 54 లక్షల మందికి సాయం అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.12,500 పెట్టుబడి సాయం ఇస్తామన్న ప్రభుత్వం తాజాగా దీనిని రూ.13,500కు పెంచింది.

పథకం ప్రారంభం సందర్భంగా లబ్ధిదారులకు సీఎం జగన్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో తాను నిర్వహించిన పాదయాత్రలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నానన్నారు. చెప్పిన సమయం కంటే 8 నెలల ముందుగానే పథకాన్ని అమలులోకి తీసుకొచ్చామన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *