Breaking News
Home / States / Andhra Pradesh / ‘వైఎస్‌ఆర్‌ నవోదయ’ పథకం ప్రారంభించిన సీఎం…

‘వైఎస్‌ఆర్‌ నవోదయ’ పథకం ప్రారంభించిన సీఎం…

అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)ల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రూపొందించిన ‘వైఎస్‌ఆర్‌ నవోదయం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల రుణాలను ఒకే విడతలో రీషెడ్యూల్‌ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు.

రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలను గట్టెక్కించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020 మార్చి 31లోగా ఎంఎస్‌ఎంఈల రుణ ఇబ్బందులు తీర్చేలా బ్యాంకులు సిద్ధం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ రుణాలు 2019 జనవరి 1 నాటికి రూ.25 కోట్లు మించి ఉండరాదని రిజర్వ్‌బ్యాంకు నిర్దేశించింది. రుణాలు రీస్ట్రక్చర్‌ చేసే తేదీ నాటికి సదరు ఎంఎస్‌ఎంఈల జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి చేసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. జిల్లాల వారీగా రుణ ఇబ్బందుల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను గుర్తించేందుకు కలెక్టర్ల నేతృత్వంలో ప్రభుత్వం కమిటీలను నియమించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *