Breaking News
Home / States / Andhra Pradesh / సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: కోటంరెడ్డి

సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: కోటంరెడ్డి

నెల్లూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. కుట్ర కోణాన్ని ఆరా తీయాలన్నారు. తాను తప్పు చేసినట్టు తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. తన తప్పేమీ లేదని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని కోటంరెడ్డి అన్నారు. అనుమతులు ఉన్నా ఎంపీడీవో వాటర్ కనెక్షన్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తాను ఎంపీడీవో ఇంటికి వెళ్లాననడం అబద్దమని కోటంరెడ్డి పేర్కొన్నారు.

కాగా నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. దీంతో కోటంరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న కోటంరెడ్డి అభిమానులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *