Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / విశాఖ నగరాభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష…

విశాఖ నగరాభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష…

అమరావతి: ఏపీ సీఎం జగన్ విశాఖ నగరాభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో ముఖ్యంగా విశాఖ నగర తాగునీటి అవసరాలు, లభ్యతపై చర్చించారు. పోలవరం నుంచి పైప్ లైన్ ద్వారా నేరుగా విశాఖకు నిరంతర నీటి సరఫరాపై అధికారులకు సూచనలు ఇచ్చారు. పోలవరం వద్దే నీటిని శుద్ధి చేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా నగరానికి తరలించాలని ఆదేశించారు. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవని రీతిలో ఏర్పాట్లు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *