Breaking News
Home / National / సీఎంగా ప్రమాణం స్వీకారం….మరో రెండు రోజులు ఆలస్యం

సీఎంగా ప్రమాణం స్వీకారం….మరో రెండు రోజులు ఆలస్యం

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గానూ 62 సీట్లలో ఆప్‌ విజయ కేతనం ఎగరేసింది. బీజేపీని 8 స్థానాలకు పరిమితం చేసింది. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఆప్‌నకు 53.57%, బీజేపీకి 38.51%, కాంగ్రెస్‌కు 4.26% ఓట్లు లభించాయి.

రెండు రోజుల వాయిదా.. తొలుత ఫిబ్రవరి 14న అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ కార్యక్రమం మరో రెండు రోజులు ఆలస్యం కానుంది. ఫిబ్రవరి 16న ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని సమాచారం. ఈ మేరకు ఆమ్‌ ఆద్మీ పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈ కార్యక్రమం జరుగనుంది. కాగా, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లతో విజయఢంకా మోగించిన కేజ్రీవాల్‌ ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *