Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వైఎస్సార్‌ జిల్లాలో.. 7, 8 తేదీల్లో సీఎం జగన్‌ పర్యటన

వైఎస్సార్‌ జిల్లాలో.. 7, 8 తేదీల్లో సీఎం జగన్‌ పర్యటన

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నెల 7, 8 తేదీల్లో వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ను సీఎం అదనపు పీఎస్‌ కె.నాగేశ్వరరెడ్డి ఆదివారం విడుదల చేశారు. షెడ్యూల్‌ ఇలా..

► 7వ తేదీ మ.3.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయల్దేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి విమానంలో కడపకు బయల్దేరుతారు.
► సాయంత్రం కడప విమానాశ్రయంలో దిగి.. హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రికి ఇడుపులపాయ అతిథిగృహంలో బస చేస్తారు.
​​​​​​​► 8వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు.
​​​​​​​► అనంతరం వైఎస్సార్‌ సర్కిల్, ఆర్‌.కె.వ్యాలీ వద్ద ఆర్‌జీయూకేటీకి చేరుకుని కొత్త భవన సముదాయానికి ప్రారంభోత్సవం.. 3 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
​​​​​​​► ఆ తర్వాత ఇడుపులపాయ అతిథి గృహానికి వెళ్తారు. మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి వెళ్లి అక్కడి∙నుంచి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *