Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం చేయూత…

ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం చేయూత…

అమరావతి: ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రీస్టార్ట్‌ ప్యాకేజి పేరుతో ఆన్‌లైన్‌లో నిధులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. శుక్రవారం సీఎం పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడుతూ.. రీస్టార్ట్‌ ప్యాకేజి కింద రూ.1,110 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. రీస్టార్ట్‌తో సుమారు 98వేల యూనిట్లకు లబ్ధి చేకూరుతుందని, సుమారు 10 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల పునరుద్ధరణ జరుగుతుందన్నారు. ప్రైవేటు రంగంలో ఎక్కువ ఉపాధి ఇచ్చేవి ఎంఎస్‌ఎంఈలేనని జగన్ వ్యాఖ్యానించారు.

ఎంఎస్‌ఎంఈలను కాపాడుకోకపోతే నిరుద్యోగం పెరుగుతుందని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు తక్కువ వడ్డీకి ఇప్పించేలా రూ.200 కోట్లు కార్పస్‌ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈలపై కలెక్టర్లంతా దృష్టి పెట్టాలని సూచించారు. కచ్చితంగా ఎంఎస్‌ఎంఈల సమస్యలు పరిష్కరించాలన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఈ రంగం పూర్తిగా కుదేలైన పరిస్థితి అని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అన్ని రకాలుగా ఆదుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పి చెల్లించలేదని విమర్శించారు. గత ప్రభుత్వం 2016-17లో రూ.195 కోట్లు, 2017-18లో రూ.207 కోట్లు, 2018-19లో రూ. 313 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహం చెల్లించలేదన్నారు. గత ప్రభుత్వం మొత్తం రూ.828 కోట్లు పెండింగ్‌లో పెట్టిందని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

Check Also

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం…

Share this on WhatsAppఅమరావతి: సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *