Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సంతృప్త స్థాయిలో.. అన్ని పథకాలు

సంతృప్త స్థాయిలో.. అన్ని పథకాలు

అధికారులతో సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎవరైనా మిగిలిపోతే అమలు తేదీ నుంచి నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు
ఆ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, అర్హులైన వారికి వర్తింప చేయాలి
అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని స్పష్టీకరణ
అర్హులందరికీ ‘నేతన్న నేస్తం’
వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద సొంత మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికీ రూ.24 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది కోవిడ్‌ కష్టాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పటికీ ఆరు నెలలు ముందుగా జూన్‌ 20న అమలు చేసింది. ఈ నేపథ్యంలో అర్హులు ఇంకా ఎవరైనా మిగిలిపోయి, దరఖాస్తు చేసుకుంటే పరిగణనలోకి తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అమరావతి: ప్రభుత్వ పథకాలన్నీ సంతృప్తికర స్థాయిలో అమలు కావాలని, అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే, పథకాల అమలు తేదీ నుంచి నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలంటూ ఇదివరకే చెప్పామన్నారు. వాటన్నింటినీ పరిష్కరించి, అర్హత ఉన్న వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలని ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పథకాల అమలు తీరుపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ గత జూన్‌లో వివిధ పథకాలు అమలు చేశామని చెప్పారు. కోవిడ్‌ కష్టకాలంలో ఆదుకునేందుకు ఏడాది ముగియక ముందే, అమలు తేదీలను ముందుకు జరిపి మరీ పథకాలు అమలు చేశామన్నారు. పథకాల లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేకపోతే ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని చెప్పామన్నారు. ఆ దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులకు లబ్ధి కలిగించాలని ఆదేశించారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *