Breaking News
Home / States / నేడు సీఎంఓ మరో ప్రకటన చేసే అవకాశం….

నేడు సీఎంఓ మరో ప్రకటన చేసే అవకాశం….

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అజయ్, ఆర్టీసీ, ఆర్టీఏ ఉన్నతాధికారులు హాజరైనారు. శుక్రవారం కోర్టులో సమ్మెపై విచారణ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించినట్లు సమాచారం. ఆర్టీసీ సమ్మెపై సీఎంఓ ఈ రోజు మరో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం రాత్రి రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోజురోజుకు బస్సుల సంఖ్య పెంచుతున్నామని, బుధవారం 6,365 బస్సులు నడిపామని ఆర్టీసీ అధికారులు వివరించారు. ప్రైవేటు వాహనాలు కూడా నడుస్తున్నాయని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సులను నూటికి నూరు శాతం తిప్పడానికి చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ఆదేశించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *