Breaking News
Home / Fashion / Beauty / చర్మం మృదువు, కాంతివంతంగా యుంచే కొబ్బరి నూనె, తేనె

చర్మం మృదువు, కాంతివంతంగా యుంచే కొబ్బరి నూనె, తేనె

బ్యూటిప్స్‌

సౌందర్య ఉత్పత్తులలో రసాయనాలు, రోజువారీ జీవనశైలిలో ఎదుర్కొనే కాలుష్యం వల్ల ముఖ కాంతి తగ్గుతుంది. సహజమైన మెరుపుతో పాటు ముఖానికి నునుపుదనాన్ని తీసుకువచ్చే మేలైన ఫేస్‌ ప్యాక్స్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

►కొబ్బరినూనె, తేనె కలిపి ముఖానికి మసాజ్‌ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పొడి చర్మం గలవారు రోజూ రాత్రి పడుకునేముందు ఈ విధంగా చేస్తుంటే చర్మం మృదువు, కాంతిమంతంగా తయారవుతుంది.

►రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్‌ పెరుగు, టీ స్పూన్‌ కీరా రసం కలిపి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్‌ ఏర్పడిన చర్మానికి సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది ఈ ప్యాక్‌.

►టీ స్పూన్‌ గోధుమపిండిలో పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి వేళ్లతో మృదువుగా రుద్దాలి.æపాలు చర్మానికి బాగా ఇంకాయనిపించాక చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం కోల్పోయిన చర్మానికి ఈ ప్యాక్‌ వల్ల మంచి కాంతి లభిస్తుంది.

►రెండు టీ స్పూన్ల క్యారెట్‌ రసంలో టీ స్పూన్‌ తేనె, రెండు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి ముఖానికి పట్టించాలి. మృదువుగా రబ్‌ చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది.

►రెండు టేబుల్‌స్పూన్ల టొమాటో జ్యూస్, టేబుల్‌ స్పూన్‌ ఓట్స్‌ అరకప్పు పెరుగులో కలపాలి. మిశ్రమం గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మెరుపు పెరుగుతుంది.

Check Also

తొక్కే కదా అని పడేస్తున్నారా..!

Share this on WhatsAppఅందరం చేసే పనే.. అరటి పండు తిని తొక్క పడేయడం. తొక్కలో ఏముంటాయని అనకండి.. బోలెడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *