Breaking News
Home / States / ఆర్టీసీ బస్సులో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ….

ఆర్టీసీ బస్సులో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ….

మల్యాల : ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిందనీ, ప్రయాణికులందరికీ తాత్కాలిక కండక్టర్లు టికెట్లు ఇవ్వాలని కలెక్టర్‌ శరత్‌ సూచించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు దిగువన ఆర్టీసీ బస్సులను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణ చార్జీలు ఎక్కువ వసూలు చేస్తున్నారా? టికెట్లను అందజేస్తున్నారా? అని ఆరా తీశారు. ప్రయాణికుల వద్ద టికెట్లను తనిఖీ చేస్తుండగా ఒక్కరికి  టికెట్‌ ఇవ్వలేదని గుర్తించారు. తాత్కాలిక కండక్టర్లు విధుల్లో సరైన అవగాహన లేక ఒక ప్రయాణికుడు తీసుకోలేదని గుర్తించిన కలెక్టర్‌ ప్రతి ఒక్క ప్రయాణికుడికీ టికెట్‌ అందజేయాలని కండక్టర్‌కు సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *