Breaking News
Home / States / సైకిల్ పై వచ్చి ఆసుపత్రిలో తనిఖీ చేసిన కలెక్టర్..

సైకిల్ పై వచ్చి ఆసుపత్రిలో తనిఖీ చేసిన కలెక్టర్..

నిజామాబాద్‌: సాధారణ వ్యక్తిగా కలెక్టర్ సైకిల్ పై సర్కారు ఆసుపత్రికి వచ్చాడు. కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి కేంద్ర ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాను బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి సైకిల్‌పై బయలుదేరి ఉదయం ఎనిమిది గంటలకల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. మొదట ఆస్పత్రి ఆవరణలో జలధార కేంద్రానికి వెళ్లారు. లీటరు మంచినీరు రెండు రూపాయలకు విక్రయించడాన్ని గుర్తించారు. రూపాయికే విక్రయించాలి కదా అని అడగ్గా.. నిర్వాహకుడు రెండు రూపాయలే అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అక్కడి నుంచి ఆస్పత్రిలోని ఓపీ విభాగం వద్ద రోగులతో పాటే లైన్‌లో నిలబడి వారితో మాట్లాడారు. వారి ఆరోగ్య సమస్యలేంటో తెలుసుకున్న ఆయన.. వైద్యులు బాగానే చూస్తున్నారా.. సౌకర్యాలు సరిగా ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి గైనిక్, జనరల్‌ తదితర విభాగాలను పరిశీలించారు. బాలింతలతో మాట్లాడారు. నాలుగైదు చోట్ల మెట్ల వద్ద, వార్డుల వద్ద కింద కూర్చొని రోగులతో మాట్లాడారు. ఓ రోగి బంధువును తనతో పాటు తీసుకుని వెళ్లి వార్డులను తనిఖీ చేశారు. జనరిక్‌ మందుల షాపులను పరిశీలించారు. వార్డు బాయ్‌లు, నర్సులు, సెక్యూరిటీ గార్డులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ శిబిరం వద్ద వివరాలు తెలుసుకున్నారు.

111 సిబ్బందికి మెమోలు
కలెక్టర్‌ మూడు గంటల పాటు తనిఖీలు నిర్వహించి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. విధుల్లో గైర్హాజరైన 111 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. జలధార కేంద్రాన్ని సీజ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *