Breaking News
Home / States / పట్టణ అటవీ ఉద్యానవనం కోసం కలెక్టర్ పరిశీలన…

పట్టణ అటవీ ఉద్యానవనం కోసం కలెక్టర్ పరిశీలన…

నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణానికి ఆనుకుని ఉన్న చిన్నపూర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పట్టణ అటవీ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడానికి కలెక్టర్ ఎంఆర్ఎం రావు సంబంధిత అధికారులు పరిశీలించారు. కలెక్టర్ తో పాటు మున్సిపల్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. చిన్నపూర్ లో 150 ఎకరాలలో పట్టణ అటవీ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. ప్రస్తుతం నిధుల నుంచి రూ.1.3 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి ముందుగా ఉద్యానవనం ఏర్పాటు చేసే ప్రాంతానికి త్వరలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనుంది. ఈ పార్కు ఏర్పాటు వల్ల హైవేకు దగ్గర ఉండడంతో ప్రజలు పర్యటించడానికి అనుకూలంగా ఉంటుందని జిల్లా యంత్రాంగం భావించి ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని, ఈ పార్కు ఏర్పాటు వల్ల వాకింగ్ పాథ్, సైకిల్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్, వాచ్ టవర్, తదితర ఏర్పాట్లు చేయనున్నట్లు అటవీశాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. వాటితో పాటు పలు రకాల వెదురు చెట్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డీఎఫ్ఓ సునీల్, ఎఫ్డీవో రాములు, మున్సిపల్ కమిషనర్ జాన్ సామ్సన్, తదితరులు పాల్గొన్నారు

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *