విజయనగరం: డోకిసీల పంచాయతీల మధ్యన ఉన్న జంతి కొండపై ఏనుగుల పునరావాస కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పార్వతీపురం మండలంలో జంతి కొండ పోరాట కమిటీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. డోకిసీల నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఐటిడిఎ వరకూ కొనసాగుతుంది. ఏనుగులు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికే పంపాలని డిమాండ్ చేశారు.
