Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / అసలు సభకు వస్తారా… రారా?

అసలు సభకు వస్తారా… రారా?

అమరావతి:ఏపీ అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఆసక్తికర చర్చ సాగింది. వల్లభనేని వంశీ, గొట్టిపాటి రవి, గంటా శ్రీనివాసరావు అసలు సభకు వస్తారా… రారా? వస్తే.. ఎక్కడ కూర్చుంటారు అనేదానిపై జోరుగా డిస్కషన్‌ జరిగింది. అయితే తొలిరోజు సభకు వల్లభనేని వంశీ, గొట్టిపాటి రవి మాత్రమే వచ్చారు. గొట్టిపాటి రవి టీడీపీ సభ్యులతో కలిసే కూర్చున్నారు. మరోవైపు- బీజేపీలోకి వెళ్తారని అనుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం సభకు రాలేదు. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సభకు వచ్చినా.. టీడీపీ సభ్యులతో కలిసి కూర్చోలేదు. కాకపోతే టీడీపీ సభ్యులకు కేటాయించిన సీట్లలో వెనుకవైపు ఖాళీగా ఉన్నచోట ఒంటరిగా కూర్చున్నారు వంశీ.23 మంది ఎమ్మెల్యేల్లో కొందరు వైసీపీతో…. మరికొందరు బీజేపీతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇందులో ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యు ఉన్నట్లు ఊహాగానాలు విన్పించాయి. దీనికి చెక్‌ పెడుతూ ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సభకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక గొట్టిపాటి రవి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. మైనింగ్‌ వ్యాపారంలో ఉన్నన తనపై అధికారులు కావాలనే కేసులు వేశారని ఆరోపించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *